CM Ramesh: ఏపీలో కరెంటు బిల్లును ముట్టుకున్నా షాక్ కొడుతోంది!: సీఎం రమేశ్

  • ఏపీలో విద్యుత్ చార్జీలపై వివాదం
  • టారిఫ్ పెంచారంటూ ప్రభుత్వంపై విమర్శలు
  • నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీఎం రమేశ్ డిమాండ్
CM Ramesh questions AP Government on electricity charges

ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారంటూ సర్కారుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై స్పందించారు. ఏపీలో కరెంటును ముట్టుకోవాల్సిన పనిలేదని, కరెంటు బిల్లును ముట్టుకున్నా షాక్ కొడుతుందని వ్యాఖ్యానించారు.

 ప్రజలకు షాక్ కొట్టే రీతిలో విద్యుత్ టారిఫ్ పెంచారని, విద్యుత్ శ్లాబ్ ను 75 యూనిట్లకు తగ్గించారని ఆరోపించారు. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయంపై నిరసనలకు బీజేపీ ఏపీ విభాగం పిలుపునిచ్చిందని, ఈ మేరకు తాను నిరసన దీక్ష చేపట్టానని సీఎం రమేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సామాన్య ప్రజలపై భారం మోపే ఇలాంటి నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News