Uttar Pradesh: రోడ్డు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి తీవ్ర దిగ్ర్భాంతి

  • ఈ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఘటన
  • 23 మంది మృతి.. మరో 20 మందికి తీవ్ర గాయాలు
  • బాధిత కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి
UP CM Yogi Adityanath condolence to Road accident victims

ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికుల మరణం దురదృష్టకరమన్న సీఎం.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు. వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయా వద్ద మరో ట్రక్కు దానిని ఢీకొట్టింది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News