New Delhi: అబ్బాయిగా నటిస్తూ 'గ్యాంగ్ రేప్' కామెంట్ చేసిన అమ్మాయి... 'బాయిస్ లాకర్ రూమ్' నిరపరాధని తేల్చిన పోలీసులు!

  • ఢిల్లీలో సంచలనం సృష్టించిన చాటింగ్
  • అమ్మాయే కావాలని అబ్బాయిగా చాటింగ్
  • అత్యాచారాలపై అబ్బాయిల మనోగతాన్ని తెలుసుకోవాలని భావించిన వైనం
  • ఎవరిపైనా కేసు నమోదు చేయడం లేదన్న ఢిల్లీ పోలీసులు
Twist in Boys Gang Rape Comments in Instagram

న్యూఢిల్లీకి చెందిన కొందరు విద్యార్థుల ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ 'బాయిస్ లాకర్ రూమ్'లో జరిగిన 'గ్యాంగ్ రేప్' కామెంట్ లపై ఇది ఓ భారీ ట్విస్ట్. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత పెను దుమారమే చెలరేగగా, పోలీసుల విచారణకు భయపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.

ఇక కేసును విచారించిన పోలీసులు, గ్రూప్ లో జరిగిన సంభాషణ వెనుక ఎవరి తప్పూ లేదని తేల్చారు. అసలు ఈ ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ లోని సభ్యులెవరూ అత్యాచారం, సామూహిక అత్యాచారం అన్న పదాలను వాడుతూ చాటింగ్ చేయలేదని తమ విచారణలో తేలిందని అన్నారు.

గ్యాంగ్ రేప్ కామెంట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై మరింత వివరణ ఇస్తూ, సిద్ధార్థ్ అనే కల్పిత పేరును పెట్టుకున్న ఓ అమ్మాయి, స్నాప్ చాట్ లో గ్యాంగ్ రేప్ చర్చను ప్రారంభించి తన ఫ్రెండ్ మనోగతాన్ని తెలుసుకోవాలని భావించిందని, దానికి సంబంధించిన చాటింగ్ స్క్రీన్ షాట్ ను తీసి, అది 'బాయిస్ లాకర్'లో జరిగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఆ బాలిక ఓ అమ్మాయిని అత్యాచారం చేద్దామని బాలుడితో వ్యాఖ్యానించిందని, అత్యాచారాలపై అతని అభిప్రాయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో అమ్మాయి ఈ చాటింగ్ చేయగా, ఆ బాలుడు అమ్మాయి ప్లాన్ లో భాగమయ్యేందుకు నిరాకరించి, చాటింగ్ నుంచి తప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తప్పుడు ఐడీని క్రియేట్ చేయడం నేరమే అయినప్పటికీ, ఆమె ఉద్దేశం చెడు ఆలోచనలతో కూడుకున్నది కాదన్న ఉద్దేశంతో ఎవరిపైనా కేసును నమోదు చేయడం లేదని వివరించారు.

More Telugu News