Reliance: రిలయన్స్ జియో మరో భారీ డీల్... రూ. 11,367 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విస్టా ఈక్విటీ!

  • ఇప్పటికే జియోలో ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పెట్టుబడులు
  • తాజా డీల్ విలువ రూ. 11,367 కోట్లు
  • 2.3 శాతం వాటాలు కొననున్న విస్టా
Reliance Jio Another Deal

ఫేస్ బుక్, సిల్వర్ లేక్ సంస్థలతో భారీ డీల్స్ కుదుర్చుకున్న రిలయన్స్ జియో మరో భారీ కంపెనీతో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్టనర్స్, జియో ప్లాట్‌ఫార్మ్స్ ‌లో 2.3 శాతం వాటాలను దక్కించుకునేందుకు ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ ఫండ్ గా పేరున్న విస్టా దాదాపు రూ. 11,367 కోట్లను జియోలో పెట్టుబడిగా పెట్టనుంది. ఇందుకు సంబంధించిన డీల్ కూడా కుదిరిపోయింది.

దీంతో వారం రోజుల వ్యవధిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న మూడో కంపెనీగా విస్టా నిలిచింది. గత నెలలో ఫేస్ బుక్ సంస్థ రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాను రూ. 43,574 కోట్లతో కొనుగోలు చేయగా, ఆపై సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ జియో ప్లాట్‌ పామ్స్ ‌లో 1 శాతం వాటాను రూ. 5,655 కోట్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, విస్టాకు గతంలోనే టెక్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది. గత పదేళ్లలో సంస్థ చేసిన ఇన్వెస్ట్ మెంట్స్ అన్నీ ఇన్వెస్టర్లకు లాభాలను మిగిల్చాయి. ఇండియాలో విస్టా పెడుతున్న మొట్టమొదటి పెట్టుబడి డీల్ ఇదే కావడం గమనార్హం. ఈ డీల్ తో వరల్డ్ లోనే అత్యంత శక్తిమంతమైన టెక్నాలజీ ఎంటర్ ప్రైజస్ సంస్థగా రిలయన్స్ జియోకు గుర్తింపు వచ్చిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News