PTBC: విశాఖలో గ్యాస్ లీకేజ్ తీవ్రతను తగ్గించేందుకు గుజరాత్ నుంచి వస్తున్న రసాయనం

  • గుజరాత్ నుంచి రానున్న పారా టెర్షియరీ బ్యుటైల్ కాటెకాల్
  • తక్షణమే పంపుతున్నామన్న గుజరాత్ సీఎంఓ
  • గుజరాత్ లోని వాపి లో మాత్రమే పీటీబీసీ తయారీ

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి లీకై గాలిలో కలిసి ప్రాణాంతకంగా మారిన రసాయన వాయువు తీవ్రత తగ్గించేందుకు అవసరమైన రసాయనాలను గుజరాత్ సర్కారు పంపిస్తోంది. తక్షణమే సంబంధిత రసాయనాల్ని పంపుతున్నట్లు గుజరాత్ సీఎం కార్యాలయ కార్యదర్శి అశ్వనీ కుమార్ తెలిపారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టిరీన్ గ్యాస్ లీకైన విషయం తెలిసిందే.  

ఆ ప్రాంతంలో దీని తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన రసాయనం పారా టెర్షియరీ బ్యుటైల్ కాటెకాల్ (పీటీబీసీ) గుజరాత్ నుంచి రానుంది. ఈ రసాయనాన్ని తక్షణమే పంపుతున్నట్టు గుజరాత్ సీఎం కార్యాలయ కార్యదర్శి అశ్వనీ కుమార్ తెలిపారు. విశాఖలో లీకైన స్టిరీన్ గ్యాస్ ను పీటీబీపీతో న్యూట్రలైజ్ చేస్తారని, ఈ రసాయనం కేవలం గుజరాత్ లోని వాపి పట్టణంలో మాత్రమే తయారవుతోందని అన్నారు.

కాగా, విశాఖ ఘటన అనంతరం పీటీబీసీని తక్షణం పంపాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం తక్షణం స్పందించింది.  ప్రత్యేక విమానం ద్వారా ఏపీకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.

More Telugu News