Indian Railways: గత ఐదు రోజుల్లో 80 వేల మందిని స్వస్థలాలకు తరలించిన రైల్వే

  • గమ్యస్థానానికి చేరుకున్న 55 రైళ్లు 
  • నిన్న వివిధ నగరాల నుంచి బయలుదేరిన మరో 30  రైళ్లు
  • ప్రయాణికుల కోసం రైళ్లలో అన్ని ఏర్పాట్లూ చేశామన్న రైల్వే
Indian Railway has moved 80000 people to their homes in the last five days

లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తోంది. ఐదు రోజుల క్రితం తరలింపు ప్రక్రియను ప్రారంభించిన రైల్వే ఇప్పటి వరకు దాదాపు 80 వేల మందిని స్వస్థలాలకు చేర్చినట్టు తెలిపింది. సోమవారం నాటికి 55 రైళ్లు గమ్యస్థానానికి చేరుకున్నట్టు పేర్కొంది. బెంగళూరు, సూరత్, సబర్మతి, జలంధర్, కోటా, ఎర్నాకులం సహా పలు ప్రధాన నగరాల్లోని స్టేషన్‌ల నుంచి నిన్న మరో 30 రైళ్లు వలస కార్మికులతో వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు వివరించింది.

ఒక్కో రైలులో కనీసం వెయ్యిమంది ప్రయాణికులు ఉన్నట్టు వివరించింది. ఆయా రాష్ట్రాల డిమాండ్ మేరకే శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్న రైల్వే మరో 500 రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు రైల్వే స్పష్టం చేసింది.

More Telugu News