Allu Arjun: తమ్ముడికి హిట్ ఇస్తే ఛాన్స్ ఇస్తానన్న అల్లు అర్జున్

  • గతంలో బన్నీతో చేసిన 'పరుగు'
  • అల్లు శిరీష్ సినిమాకి సన్నాహాలు
  • మాట ఇచ్చిన అల్లు అర్జున్  
Bommarillu Bhaskar Movie

'బొమ్మరిల్లు' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసి, ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్న భాస్కర్ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆ తరువాత ఆయన బన్నీతో 'పరుగు' అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది. అలాంటి భాస్కర్ తో చేయడానికి ఒక కండిషన్ పై బన్నీ ఒప్పుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది.

'బొమ్మరిల్లు' భాస్కర్ తాజా చిత్రంగా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' రానుంది. అఖిల్ కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా తరువాత అల్లు శిరీష్ తో చేయడానికి భాస్కర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బన్నీకి కూడా ఒక కథ వినిపించాడట. అయితే అల్లు శిరీష్ తో చేయనున్న సినిమా హిట్ అయితే, తాను తప్పకుండా ఛాన్స్ ఇస్తానని బన్నీ మాట ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. బన్నీతో ఛాన్స్ కోసం భాస్కర్ ఏ స్థాయిలో కష్టపడతాడో చూడాలి మరి.

More Telugu News