London: లాక్‌డౌన్‌లో శరీరంపై రోజుకో టాటూ.. మరో టాటూకి చోటు లేని వైనం!

  • తన ఫొటోలు పోస్ట్ చేసిన లండన్‌ యువకుడు 
  • టాటూలతో నిండిపోయిన శరీరం
  • అనేక బొమ్మలతో టాటూలు
Im tattooing myself every day in lockdown but Im running out of space

కరోనా వైరస్‌ విజృంభణతో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉంటూ ఎన్నో రకాలుగా కాలక్షేపం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం టీవీ, ఇంటర్నెట్‌, పుస్తకాలు చదవడం వంటి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, లండన్‌లోని వాల్తమ్‌స్టో ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో నివసించే క్రిస్ వుడ్ హెడ్ అనే టాటూ ఆర్టిస్ట్‌ మాత్రం లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటూ తన శరీరంపై రోజుకో టాటూ వేసుకుంటూ వచ్చాడు. అలా ఒళ్లంతా టాటూల మయం అయిపోవడంతో.. ఇప్పుడు మరో టాటూ వేసుకోవడానికి శరీరంలో చోటులేని స్థితికి వచ్చేశాడు. ఇక తాను వేసుకున్న టాటూలను ఈ పచ్చబొట్ల కళాకారుడు ప్రతి రోజు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నాడు.  
                 
         
ఇంట్లో తన కుక్కతో ఆడుకుంటూ, శరీరంపై టాటూలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో శరీరంపై టాటూలు వేసుకోవడానికి ఇంకా ఎక్కడ ఖాళీ ఉందా? అని ప్రస్తుతం వెతుకుతున్నాడు. టాటూలతో నిండిపోయిన శరీరంలో చిన్న పాటి ఖాళీ దొరికినా అక్కడే మిగతా రోజుల్లో టాటూలు వేసుకోవాలని భావిస్తున్నాడు.

                                                                                                                
అయితే, తన శరీరంపై ఇంకా టాటూలు వేసుకోవడానికి అతి కష్టం మీద, అతి తక్కువ స్పేస్‌ను గుర్తించానని చెప్పాడు. అయితే, అక్కడ చోటు కొద్దిగా మాత్రమే ఉండడంతో ప్రస్తుతం బాధగా వుందంటున్నాడు. పోతే, ఇన్నాళ్లూ తేలు, చెట్లు, జంతువులు, మనుషులు, గంట, ఓం.. వంటి రకరకాల టాటూలు వేసుకున్నాడు. చివరికి అరికాలు మీద కూడా టాటూ వేసుకోవడం విశేషం.                                         

More Telugu News