Allu Sirish: 'విజేత' దర్శకుడితో అల్లు శిరీష్

  • 'విజేత'తో పరిచయమైన రాకేశ్ శశి
  • తదుపరి ప్రాజెక్టుకు సన్నాహాలు
  • గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాణం
Allu Sirish Movie

తెలుగులో యువ కథానాయకుడిగా దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, నిదానమే ప్రధానం అన్నట్టుగా అల్లు శిరీష్ ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వెళుతోంది. దాంతో అల్లు శిరీష్ తదుపరి సినిమా ఏమిటనే విషయంలో ఆసక్తిని రేకెత్తించడంలో ఆయన విఫలమయ్యాడనే టాక్ వుంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాకేశ్ శశితో ఒక సినిమా చేయడానికి శిరీష్ అంగీకరించాడని అంటున్నారు. గతంలో కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' చేసిన రాకేష్ శశి, ఇటీవలే శిరీష్ కి ఒక కథను వినిపించి ఓకే అనిపించుకున్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు సమాచారం. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.

More Telugu News