India: రక్షణ రంగ వ్యయంలో 'నంబర్-3'గా అవతరించిన భారత్!

  • గతేడాది భారత్ మిలిటరీ ఖర్చు 71.1 బిలియన్ డాలర్లు
  • అగ్రస్థానంలో అమెరికా
  • 2019లో యూఎస్ 732 బిలియన్ డాలర్ల వ్యయం
  • చైనా కంటే అధిక వ్యయం
India emerges as top three in military expenditure

రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ మొట్టమొదటిసారిగా మూడోస్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా ప్రథమస్థానంలో ఉండగా, ఆసియా పెద్దన్న చైనా రెండోస్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న భారత్ 2019లో రక్షణ రంగం కోసం 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) తెలిపింది.

నంబర్ వన్ గా ఉన్న అమెరికా ఈ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అమెరికా రక్షణ రంగ వ్యయం 732 బిలియన్ డాలర్లు అని ఎస్ఐపీఆర్ఐ వెల్లడించింది. తర్వాత స్థానంలో ఉన్న చైనా తన సైనిక బలగాల కోసం 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇక, రష్యా (65.1 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (61.9 బిలియన్ డాలర్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2019లో ప్రపంచ సైనిక వ్యయం మొత్తం 1,917 బిలియన్ డాలర్లు అని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. 2018తో పోల్చితే 3.6 శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది.

More Telugu News