Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • లక్కీ ఛాన్స్ కొట్టిన కీర్తి సురేశ్
  • ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ 
  • స్క్రిప్ట్ పూర్తి చేస్తున్న వర్మ 
Keerthi Suresh to act opposite Mahesh Babu

 *  అందాలభామ కీర్తి సురేశ్ త్వరలో మహేశ్ బాబుతో జోడీ కట్టనుంది. పరశురాం దర్శకత్వంలో మహేశ్ నటించే చిత్రంలో ఓ హీరోయిన్ గా కీర్తి సురేశ్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం కీర్తి అటు తమిళంలో రజనీకాంత్ తో ఓ చిత్రం.. ఇటు తెలుగులో నితిన్ తో ఓ చిత్రం చేస్తోంది.
*  ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఆ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం 'టక్ జగదీశ్' చిత్రాన్ని రూపొందిస్తున్న శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తాడు.
*  అందరి దృష్టినీ ఆకర్షించే సమస్యలపైన, వివాదాల పైన సినిమాలు తీయడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటు. ఇదే కోవలో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహా మహమ్మారి కరోనా వైరస్ పై కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ఆయన సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పనిని పూర్తి చేస్తున్నట్టు వర్మ తెలిపారు.

More Telugu News