Srikakulam District: శ్రీకాకుళంలో రోడ్లపై తిరుగుతున్న ఇరాక్ అమ్మాయిలు.. అరెస్ట్‌

  • శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఘటన
  • లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ అమ్మాయిలు
  • కాలేజీ యాజమాన్యం కళ్లుగప్పి బయటకు వచ్చిన వైనం
police arrests iraq girl

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇరాక్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్‌ సమీపంలో రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. శ్రీకాకుళంలోని ఓ కాలేజీలో వారు ఎమ్‌ఫార్మసీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వీరు వుంటున్నారు.

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి వీరు రోడ్లపైకి రావడంతో, ఈ విషయాన్ని గుర్తించిన వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వీరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

More Telugu News