Narendra Modi: లాక్ డౌన్ 31తో ముగియక పోవచ్చు: ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ

  • ప్రస్తుతానికి 31 వరకూ లాక్ డౌన్
  • ఆపై మరో వారం రోజులన్నా కొనసాగే అవకాశం
  • అప్పటికి పరిస్థితి సజావుగా మారుతుందని మోదీ ఆశాభావం
Lockdown Continue for another 15 Days

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో 15 రోజుల పాటన్నా కొనసాగాలని, అప్పుడే వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం, సోషల్ డిస్టెన్స్, కంపెనీల మూసివేత, సమావేశాల రద్దు వంటివి నెలాఖరుతో ముగియబోవని, 31 తరువాత ఇంకో వారం రోజులైనా ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నట్టు సమాచారం. నిన్న లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన తరువాత స్పీకర్ చాంబర్ వైపు మోదీ రాగా, ఆయన్ను పలువురు పార్టీల ఎంపీలు కలిశారు.

ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. లాక్ డౌన్ ఎంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని ప్రధానిని ఎంపీలు ప్రశ్నించిన వేళ, మరో రెండు వారాలు ఉండవచ్చని, అప్పటికి అంతా సజావుగా మారుతుందనే భావిస్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైరస్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి కోరగా, దానిని పరిశీలిస్తున్నామని ప్రధాని జవాబిచ్చినట్లు ఓ ఎంపీ వెల్లడించారు.

More Telugu News