Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • పూజ హెగ్డేకు నాలుగు కోట్లు?
  • 'నారప్ప' భారీ షెడ్యూల్ పూర్తి 
  • బాలయ్య, బి.గోపాల్ సినిమా అప్ డేట్  
Pooja Hegde charges four crores for Salman flick

 *  తెలుగులో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న పూజ హెగ్డే తాజాగా సల్మాన్ ఖాన్ సరసన హిందీలో నటించడానికి అంగీకరించింది. 'కభి ఈద్ కభి దివాలి' పేరిట రూపొందే ఈ చిత్రంలో నటించడానికి గాను ఈ ముద్దుగుమ్మ భారీ మొత్తంలో 4 కోట్లు తీసుకుంటున్నట్టు తాజా సమాచారం.
*  తమిళంలో హిట్టయిన 'అసురన్' చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరిట రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూలు ముగిసింది. నెల రోజుల పాటు తమిళనాడులో ఈ షెడ్యూలును నిర్వహించారు.
*  ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న బాలకృష్ణ దీని తర్వాత ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును జూన్ 10న బాలయ్య పుట్టిన రోజున ప్రారంభిస్తారట.

More Telugu News