debit: రెండు రోజుల్లో ఈ డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్‌లైన్‌ లావాదేవీలు బంద్!

  • ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీ జరపని కార్డులకు 16 నుంచి  ఆ సేవలు నిలుపుదల
  • కాంటాక్ట్‌ లెస్‌ కార్డుల ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలపై ఆర్‌‌బీఐ ఆంక్షలు
  • బ్యాంకుల నుంచి అనుమతి తీసుకుంటేనే ఆ సేవల కొనసాగింపు
These debit credit cards will be disabled permanently by March 16

డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్న వినియోగదారులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌‌బీఐ) కీలక సూచన చేసింది. కొన్ని రకాల కార్డుల ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఈ నెల 16 నుంచి ఆంక్షలు విధించనుంది. ఖాతాదారుల డెబిట్‌, క్రెడిట్ కార్డులను మరింత సుక్షితంగా మార్చే చర్యల్లో భాగంగా ఆర్‌‌బీఐఈ నిర్ణయం తీసుకుంది. కార్డులను అనుచితంగా వాడడాన్ని, బ్యాంకింగ్‌ మోసాలను అరికట్టేందుకు అన్ని బ్యాంకులకు జారీ చేసిన నిబంధనలు సోమవారం నుంచి అమలు కానున్నాయి.

ఇందులో భాగంగా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీ జరపని కార్డులు, కాంటాక్ట్‌ లెస్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డులతో సోమవారం నుంచి ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేసేందుకు వీలుండదు. వీటితో కేవలం డొమెస్టిక్ లావాదేవీలు చేసేందుకే అనుమతి ఉంటుంది. అంటే  ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పాయింట్ ఆఫ్ సేల్స్‌  (పీఓఎస్‌) టెర్మినల్స్‌లో మాత్రమే కార్డులను వాడుకోవచ్చు.

మునుపటి మాదిరిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే మాత్రం ఖాతాదారులు తమ బ్యాంకుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. ఈ సమాచారాన్ని అన్ని బ్యాంకులు ఇప్పటికే సంక్షిప్త సందేశాల రూపంలో తమ ఖాతాదారులకు చేరవేశాయి. ఎస్ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌లతో పాటు ఇంటర్నెట్  ద్వారా అనుమతి తీసుకునేందుకు బ్యాంకులు అనుమతి ఇచ్చాయి.

More Telugu News