GopiChand: ఉత్కంఠను రేకెత్తించే యాక్షన్ ఎపిసోడ్లో గోపీచంద్

  • సంపత్ నంది నుంచి 'సీటీమార్'
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ 
  • కబడ్డీ కోచ్ లు గా గోపీచంద్ - తమన్నా
SeetiMaar Movie

గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గౌతమ్ నంద' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా తనతో మరో సినిమా చేసే అవకాశాన్ని గోపీచంద్ కల్పించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సీటీమార్' సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమాలో, గోపీచంద్ సరసన తమన్నా నటిస్తోంది. ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కబడ్డీ కోచ్ లు గా కనిపించనున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ పై  ట్రైన్ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ తో పాటు తమన్నా కూడా ఈ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటోంది. ఈ ట్రైన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో గోపీచంద్ వున్నాడని అంటున్నారు. సంపత్ నంది - గోపీచంద్ కలిసి ఈ సారైనా హిట్ కొడతారేమో చూడాలి.

More Telugu News