Allu Arjun: ఫారెస్ట్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి

  • విజయ్ సేతుపతికి తమిళంలో మంచి క్రేజ్
  • తెలుగు నుంచి వరుస అవకాశాలు 
  • సుకుమార్ మూవీలోను ముఖ్యమైన రోల్
Sukumar Movie

ఒక్క హీరోగా అని మాత్రమే కాదు .. విలక్షణమైన ఇతర పాత్రలను సైతం పోషిస్తూ విజయ్ సేతుపతి శభాష్ అనిపించుకుంటున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను కీలకమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగులో 'ఉప్పెన' అనే సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో తెలుగు సినిమాను కూడా విజయ్ సేతుపతి అంగీకరించాడనేది తాజా సమాచారం.

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్లకి సహకరించే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకి గాను విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన అవినీతి అధికారిగా కనిపిస్తాడా? సిన్సియర్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనేది తెలియాల్సి వుంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News