Pawan Kalyan: ‘వకీల్​ సాబ్​’ నుంచి ‘మగువ మగువ’ ప్రోమో రిలీజ్​

  • పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ 
  • 8వ తేదీ ఉదయం 10 గంటలకు ‘మగువ’ సాంగ్ విడుదల
  • ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు
Maguva Maguva promo from Vakeel Saab

ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి తొలి సాంగ్ ను విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు ‘మగువ మగువ’ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మగువ మగువ’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.  ‘మగువ మగువ లోకానికి తెలుసు నీ విలువ.. మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా..’అంటూ కొనసాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

More Telugu News