Corona Virus: వికారాబాద్​ లో ‘కరోనా’ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదన

  • వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి వద్ద ప్రత్యేక ఆసుపత్రి 
  • ప్రజలకు దూరంగా ‘కరోనా’ బాధితులకు చికిత్స  
  • తెలంగాణలో ‘కరోనా’ కేసులు నాలుగు నమోదు
Hospital for corona patients in Vikarabad

తెలంగాణలో కరోనా వైరస్ కు సంబంధించి నాలుగు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రజలకు దూరంగా  ‘కరోనా’ బాధితులకు చికిత్స అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘కరోనా’ బాధితుల కోసం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి వద్ద ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేసింది.

More Telugu News