Twitter: ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తే... జగన్ కు మతాన్ని అంటగట్టను: ఐవైఆర్ కృష్ణారావు

  • జగన్ కు మతాన్ని అంటగడితే ఊరుకోబోమన్న వెల్లంపల్లి
  • ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించిన ఐవైఆర్
  • వైరల్ అవుతున్న పోస్టులు
IYR Krishnarao Questions Jagan

ఆంధ్రప్రదేశ్ సీఎంకు మతాన్ని అంటగడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తాను సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తే, జగన్ కు మతాన్ని అంటగట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు.
"నిజమే. కానీ ఈ కింది అంశాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.

1. హిందూ మత సంస్థల నుంచి హైందవేతరులను తొలగిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడానికి కారణాలేమిటో?
2. చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దాని క్రిందికి ధార్మిక సిబ్బందిని తేకపోవడం ఏమిటి?

3. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ కు చట్టబద్ధత కల్పించి దానిని సమరసత వేదికతో అనుసంధానం చేయకపోవడం.
4. రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా ఇమామ్లకు, పాస్టర్లకు వేతనాలు చెల్లించటం.
5. ప్రభుత్వ ధనం నుంచి జెరూసలేం యాత్రకు సహాయం, చర్చిలు కట్టడానికి సహాయం చేయడం ఏమిటి?
6. దేవతా విగ్రహాలపై దుండగులు దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. దేవాదాయ శాఖ మాత్యులుగా ఆ ప్రదేశాలను కూడా సందర్శించకుండా ఉండటం.
ఈ పై అంశాలకు అన్నింటికీ సరైన సమాధానం చెప్పగలిగితే ముఖ్యమంత్రి గారికి మతాన్ని అంట కట్టాల్సిన అవసరం ఉండదు" అని ఐవైఆర్ పేర్కొన్నారు. 

More Telugu News