Ap high court Justice Devanand: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన బట్టు దేవానంద్ కు ఆత్మీయ సత్కారం

  • గుడివాడలో దేవానంద్ కు సత్కారం
  • హైకోర్టు న్యాయమూర్తిగా ఈ ప్రాంత వాసిని నియమించడం అదృష్టం
  •  అంబేద్కర్ ఆశయ సాధనకు దేవానంద్ పాటుపడతారని ఆశిస్తున్నా: కొడాలి నాని
Felicitation to Ap high court Justice Devanand

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ కు ఆత్మీయ సత్కారం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలోని స్థానికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొడాలి నాని, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, గుడివాడకు చెందిన బట్టు దేవానంద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సమాజంలో అసమానతలు తొలగాలన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు దేవానంద్ పాటుపడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.  అనంతరం కావూరి సాంబశివరావు మాట్లాడుతూ, చరిత్రలో నిలిచిపోయేలా దేవానంద్ తీర్పులు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని, సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి ఆయన ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు.

More Telugu News