Nirbhaya: నిర్భయ దోషుల మానసిక పరిస్థితి బాగానే ఉంది.. కోర్టుకు తెలిపిన తీహార్ జైలు అధికారులు

  • గతంలోనూ వారిలో మనో వైకల్యం ఉన్న దాఖలాలేమి లేవు
  • న్యాయవాది ఏపీ సింగ్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు
  • ఢిల్లీ కోర్టుకు తెలిపిన తీహార్ జైలు అధికారులు
Nirbhaya Case Convict Has No History Of Mental Instability

నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల మానసిక పరిస్థితి బాగానే ఉందని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. గతంలోనూ వారిలో మనో వైకల్యం ఉన్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ మతిస్థిమితం కోల్పోయాడని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తీహార్ జైలు అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్  కోర్టుకు విన్నవించారు.

ఉరిశిక్షను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న వినయ్ తన తలను గోడకు బాదుకొని గాయపరుచుకున్న సంగతి తెలిసిందే. వినయ్ కావాలనే ఈ పని చేశాడని, జైలు డాక్టర్లు వెంటనే అతనికి చికిత్స అందించారని ఇర్ఫాన్ కోర్టుకు తెలిపారు. ‘నలుగురు దోషులనూ జైలు డాక్టర్లు పరీక్షించారు. గతంలో వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకున్నాం. వాళ్ల లాయర్ ఏపీ సింగ్ చెబుతున్నట్టుగా వినయ్ కు ఎలాంటి మనో వైకల్యం లేదు’ అని స్పష్టం చేశారు.

More Telugu News