Rakshith: 'పలాస 1978' సినిమా విడుదల తేదీ ఖరారు

  • విభిన్నమైన కథాంశంతో 'పలాస 1978'
  • నాయకా నాయికలుగా రక్షిత్ - నక్షత్ర 
  • మార్చి 6వ తేదీన విడుదల  
Palasa 1978 Movie

వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'పలాస 1978' సినిమా రూపొందింది. అట్లూరి ధ్యాన్  నిర్మించిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి రఘు కుంచె సంగీతాన్ని సమకూర్చాడు. రక్షిత్ - నక్షత్ర నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో రఘు కుంచె కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. వచ్చేనెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఈ  సినిమాపై అందరిలో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది. సహజత్వానికి దగ్గరగా మలచబడిన పాత్రలతో సాగే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News