Saitej: 'సోలో బ్రతుకే సో బెటర్' నుంచి శాంపిల్ వచ్చేస్తోంది

  • సాయితేజ్ నుంచి మరో యూత్ ఫుల్ మూవీ 
  •  దర్శకుడిగా 'సుబ్బు' పరిచయం 
  • కథానాయికగా నభా నటేశ్  
Solo Brathuke So Better Movie

సాయితేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా 'సుబ్బు' అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సాయితేజ్ జోడీగా నభా నటేశ్ కనిపించనుంది. బ్యాచిలర్ లైఫ్ లోనే అసలైన కిక్ వుంది అనుకునే కథానాయకుడి చుట్టూ తిరిగే కథ ఇది.

ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియోను విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా వుంది. ఇటీవల సాయితేజ్ చేసిన 'ప్రతిరోజూ పండగే' బాగానే ఆడింది. తాజాగా చేస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' మాత్రం తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News