Vijay Devarakonda: సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'

  • వైవిధ్యభరిత చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • విజయ్ దేవరకొండ సరసన నలుగురు నాయికలు 
  • ఈ నెల 14వ తేదీన భారీస్థాయి విడుదల

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందిన 'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లె లైట్ నటించారు. నలుగురు కథానాయికలతో విజయ్ దేవరకొండ రొమాన్స్ కి సంబంధించిన కథ కావడంతో, యూత్ ఈ సినిమాపట్ల ఆసక్తిని చూపుతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మించిన ఈ సినిమా, 155 నిమిషాల నిడివిని కలిగి వుంది.

More Telugu News