oscars: ఆస్కార్ ఉత్తమ చిత్రంగా 'పారాసైట్'.. పూర్తి వివరాలు!

  • ఉత్తమనటుడిగా వాకిన్ ఫినిక్స్ (జోకర్ చిత్రానికి)
  • ఉత్తమ నటిగా రెనీ జెల్‌వెగర్‌ (జూడీ సినిమాకు) 
  • ఉత్తమ దర్శకుడిగా జోన్‌జోన్‌ హొ (పారాసైట్)

అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌, డాల్బీ థియేటర్‌లో 'ఆస్కార్‌' అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్తమ చిత్రంగా పారాసైట్ నిలిచింది. ఉత్తమనటుడిగా వాకిన్ ఫినిక్స్ (జోకర్ చిత్రానికి), ఉత్తమ నటిగా రెనీ జెల్‌వెగర్‌ (జూడీ సినిమాకు) నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా పారాసైట్ సినిమాకి గానూ జోన్‌జోన్‌ హొ నిలిచారు.

ఉత్తమ సహాయ నటుడిగా హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌ పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)కి అవార్డు దక్కింది. ఉత్తమ సహాయనటిగా లారా డ్రెన్‌(మ్యారేజ్‌ స్టోరీ సినిమాకు) అవార్డు వచ్చింది. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ చిత్రంగా 'టాయ్‌ స్టోరీ 4' నిలిచింది. మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌కు బాంబ్‌ షెల్‌కు, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌కుగానూ 1917 (రోచ్‌రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డోమినిక్‌ తువే)కు అవార్డులు దక్కాయి.

ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ విభాగంలో ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీకి గానూ మైఖేల్‌ మెక్‌సుకర్‌, ఆండ్రూ బక్‌ల్యాండ్‌కు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు 1917కిగానూ రోజర్‌ డికెన్స్‌కు,  ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌లో ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీకిగానూ డొనాల్డ్‌ సిల్వెస్టర్‌కు,  ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌లో మళ్లీ 1917కి గానూ మార్క్‌ టేలర్‌, స్టువర్ట్‌ విల్సన్‌కు అవార్డులు దక్కాయి.

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లేకి బాంగ్‌ జూన్‌ హో (పారాసైట్‌) అవార్డు వరించింది. ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా హెయిర్‌ లవ్‌, ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ది నైబర్స్‌ విండో నిలిచాయి. ఉత్తమ డాక్యుమెంటరీ(ఫీచర్‌)గా అమెరికన్‌ ఫ్యాక్టరీ నిలిచింది. ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లేకి గానూ తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్‌)ని ఆస్కార్ వరించింది.  ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌కి జాక్వెలిన్‌ దురన్‌ (లిటిల్‌ విమన్‌)కి అవార్డు దక్కింది. అవార్డులు అందుకున్న వారంతా అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News