Oscar: ఆస్కార్ ఉత్తమ నటుడు రేసులో లియొనార్డో డికాప్రియో, ఆంటోనియో బండెరాస్

  • ఆస్కార్ సంబరాలకు రంగం సిద్ధం
  • ఫిబ్రవరి 9న అవార్డుల ప్రదానోత్సవం
  • 15 కేటగిరీలలో నామినేషన్ల ప్రకటన

ప్రపంచస్థాయిలో ఆస్కార్ అవార్డులకు ఉన్న క్రేజ్ మరే ఇతర చిత్ర పురస్కారాలకు ఉండదు. ప్రధానంగా హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే అవార్డులే అయినా అన్ని దేశాల చిత్రపరిశ్రమలు, అభిమానులు ఆస్కార్ అవార్డులపై ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ ఏడాది కూడా ఆస్కార్ సంబరాలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇక అసలు విషయానికొస్తే, ఈసారి ఉత్తమ నటుడు కేటగిరీలో లియొనార్డో డికాప్రియో, ఆంటోనియో బండెరాస్ లు పోటీపడుతున్నారు. ఈ మేరకు 15 కేటగిరీల్లో నామినేషన్లు ప్రకటించారు.

'పెయిన్ అండ్ గ్లోరీ' చిత్రంలో బండెరాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అటు 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రంతో డికాప్రియా మరోసారి అలరించాడు. ఇదే కేటగిరీలో ఆడమ్ డ్రివెర్ (మ్యారేజ్ స్టోరీ), జాక్విన్ ఫినిక్స్ (జోకర్), జోనాథన్ ప్రైసీ (ది టూ పోప్స్) కూడా ఉన్నారు. ఇతర ప్రధాన కేటగిరీల విషయానికొస్తే....

ఉత్తమ చిత్రం నామినేషన్లు

జోకర్, మ్యారేజ్ స్టోరీ, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, పారాసైట్, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్, లిటిల్ ఉమెన్, 1917.

ఉత్తమ దర్శకుడు నామినేషన్లు

క్వెంటిన్ టరాంటినో (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), మార్టిన్ స్కోర్సెస్సి (ది ఐరిష్ మ్యాన్), టాడ్ ఫిలిప్స్ (జోకర్), బాంగ్ జున్ హో (పారాసైట్), శామ్ మెండెస్ (1917).

ఉత్తమ నటి నామినేషన్లు

రెనీ జెల్వెగర్ (జూడీ), చార్లీజ్ థెరాన్ (బాంబ్ షెల్), సింతియా ఎరివో (హ్యారియెట్), స్కార్లెట్ జాన్సన్ (మ్యారేజ్ స్టోరీ)



More Telugu News