Arvind Kejriwal: చట్టపరమైన లొసుగులే వారిని కాపాడుతున్నాయి: నిర్భయ దోషులకు ఉరి వాయిదాపై కేజ్రీవాల్

  • మరోమారు వాయిదా పడిన నిర్భయ దోషుల ఉరి
  • చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటున్న నిర్భయ దోషులు
  • చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్న కేజ్రీవాల్

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోమారు వాయిదా పడడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని శిక్ష అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తుండడం దారుణమన్నారు. అత్యాచార కేసుల్లో దోషులకు ఆరు నెలల్లోపే కఠిన శిక్ష అమలయ్యేలా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

నిర్భయ దోషులకు మరణశిక్షను వాయిదా వేస్తూ నిన్న పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో ఏ ఒక్కరికి శిక్ష అమలు వాయిదా పడినా మిగిలిన వారికీ అది వర్తిస్తుంది. ఈ లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న నిర్భయ దోషులు శిక్ష అమలును వీలైనంత ఆలస్యం చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News