Vijay Devarakonda: విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'వరల్డ్ ఫేమస్ లవర్' తమిళ టీజర్

  • నలుగురు కథానాయికలతో విజయ్ దేవరకొండ 
  •  ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తమిళ టీజర్ 
  • వచ్చేనెల 14వ తేదీన సినిమా విడుదల 

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం రూపొందింది. రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, వచ్చేనెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తెలుగుతోపాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను, హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయించనున్నారు. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోను తన మార్కెట్ పెరుగుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత  పూరి జగన్నాథ్ తో చేస్తున్న ప్రాజెక్టుతో ఆయన బాలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం.

More Telugu News