East Godavari District: ప్రభుత్వ తప్పుడు కేసులతో 48 రోజులు జైల్లో గడిపాను!: హర్షకుమార్

  • బెయిలు వచ్చినా విడుదల చేయలేదు 
  • మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు 
  • నేను ఏ తప్పు చేయలేదు

తాను ఏ తప్పు చేయలేదని, అయినా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించడంతో అన్యాయంగా 48 రోజులపాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చిందని అమలాపురం మాజీ ఎంపీ, దళితనాయకుడు హర్షకుమార్ వాపోయారు. డిసెంబరు 13న అరెస్టయి కోర్టు ఆదేశాలతో రిమాండ్ లో ఉన్న ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడు కేసుల్లో కోర్టు బెయిలు మంజూరు చేసినా అధికారులు తనను విడుదల చేయలేదన్నారు. జైలులో ఉండగా అనారోగ్యం చేస్తే రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారని, కానీ పూర్తిగా స్వస్థత చేకూరక ముందే మూడు రోజుల్లోనే డిశ్చార్జి చేసి మళ్లీ జైలుకు తరలించారని తెలిపారు. ప్రభుత్వం తీరువల్ల ఇన్నాళ్లు జైలులో గడపాల్సి వచ్చిందని వాపోయారు.

More Telugu News