Mohanlal: భారీగా అంచనాలు పెంచేస్తున్న 'మరక్కర్' టీజర్

  • గుర్తుండిపోయే దేశభక్తి చిత్రంగా 'కాలాపాని'
  • కేరళ నేపథ్యంలో సాగే 'మరక్కర్'
  • మార్చి 26వ తేదీన విడుదల   

మోహన్ లాల్ .. ప్రియదర్శన్ కాంబినేషన్ అనగానే 'కాలాపాని' సినిమా గుర్తుకు వస్తుంది. ఆంగ్లేయుల అరాచకాలు .. భారతీయుల దేశభక్తిని ఆ సినిమా కళ్లకు కట్టింది. అలాంటి దేశభక్తి చిత్రమే ఈ కాంబినేషన్లో మరోసారి రూపొందుతోంది .. ఆ సినిమా పేరే 'మరక్కర్'. నిన్న విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది

పోర్చుగీసు వారు కేరళ వైపుకు వచ్చినప్పుడు, వాళ్లను ధైర్యంగా ఎదుర్కున్న యోధుడే 'మరక్కర్' అని కేరళ చరిత్ర చెబుతోంది. పోర్చుగీసువారితో పోరాడిన నావికాదళానికి మరక్కర్ నాయకత్వం వహించాడని అంటారు. ఆయన జీవితచరిత్ర ఆధారంగానే ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విడుదల తేదీ కోసం మోహన్ లాల్ అభిమానులంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.

More Telugu News