Anand Mahindra: మరో అద్భుతమైన వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా

  • కాళ్లు లేని దివ్యాంగుడి అమోఘమైన విన్యాసం
  • తన దేహాన్నే త్రివర్ణ పతాకంలా మలిచిన వైనం
  • స్ఫూర్తి కలిగిస్తోందంటూ స్పందించిన ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. చిత్రవిచిత్రమైన వీడియోలనే కాదు, సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక వీడియోలను కూడా పోస్టు చేస్తూ నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తుంటారు. తాజాగా ఆయన ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. నడుం కింది నుంచి రెండు కాళ్లు లేని ఓ దివ్యాంగుడు ఒంటిపై త్రివర్ణ పతాకాన్ని పోలిన దుస్తులు ధరించి ఓ జెండా కర్రపైకి ఎగబాకి త్రివర్ణ పతాకాన్ని తలపించేలా చేసిన విన్యాసాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎంతో స్ఫూర్తిని కలిగించేలా ఉన్న ఆ వీడియో మరెంతోమందికి ప్రేరణాత్మకంగా ఉండొచ్చని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.

More Telugu News