Telangana: గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పరేడ్‌లో తెలంగాణ శకటం

  • రాజ్ పథ్ వద్ద వేడుకలు
  • తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిన శకటం
  • గొండి, తోటి, ప్రదాన్‌, కొమ్ముకోయ  నృత్యాలు కూడా

ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్‌లో గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. ఈ శకటాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన విషయం తెలిసిందే. బతుకమ్మ, మేడారం జాతర, వేయి స్తంభాల గుడిని ఈ శకటంలో చూపారు.

అలాగే, గిరిజన సంస్కృతిని చాటి చెప్పే గొండి, తోటి, ప్రదాన్‌, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రదర్శించారు. 2015లో మొదటిసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. మళ్లీ ఈ సారి తెలంగాణ శకటం కనపడింది. కాగా, ఈ పరేడ్‌లో భారత సైనికుల శక్తిని దేశం ప్రదర్శించింది. అలాగే, యాంటీ శాటిలైట్ మిసైల్ ఎ శాట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది.

More Telugu News