Akash Puri: యూత్ ను ఆకట్టుకుంటున్న 'రొమాంటిక్' సాంగ్

  • మరో ప్రేమకథగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా సునీల్ కాశ్యప్

పూరి జగన్నాథ్ అందించిన కథతో ఆయన శిష్యుడు అనిల్ పాదూరి 'రొమాంటిక్' చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాతో కేతిక శర్మ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. "నా వల్ల కాదే .. నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది నా వల్ల కాదే. నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది నా వల్ల కాదే" అంటూ ఈ పాట సాగుతోంది.

నిన్న విడుదల చేసిన ఈ పాటకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కాశ్యప్ సంగీతం .. ఆలాపన, భాస్కరభట్ల సాహిత్యం ఈ పాటను యూత్ లోకి బాగా తీసుకెళ్లాయి. పూరి - చార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా నడుస్తుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

More Telugu News