iyr krishna rao: పెద్ద ఎత్తున స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందనడానికి ఇదొక నిదర్శనం: ఐవైఆర్ కృష్ణారావు

  • అమరావతి రాజధానిపై ఐవైఆర్ కృష్ణారావు స్పందన
  • అమరావతి నిర్మాణం ప్రారంభం కాకముందే స్పెక్యులేటివ్ కార్యక్రమాలు
  • ఏదో ఒక రోజు అటు ఇటుగా కుప్పకూలే అవకాశాలే జాస్తి

అమరావతి రాజధానిపై ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి పలు వ్యాఖ్యలు చేశారు. 'అమరావతి నగర నిర్మాణం ప్రారంభం కాకముందే అది అతి స్పెక్యులేటివ్ కార్యక్రమాలకు బలి అయ్యింది. అత్యంత ఆశావహమైన అభివృద్ధి అంచనాల పరంగా కూడా అది కొనసాగగలిగింది కాదు' అని ఆయన ట్వీట్ చేశారు.
 
'రాజధాని పేరుతో పెద్ద ఎత్తున స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రాంతంలో జరిగింది అనటానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వం చిత్తశుద్ధితో వికేంద్రీకరణను అమలు చేస్తూ పోతే ఈ గ్రోత్ కారిడార్ చాలా కొద్ది ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం అంతటా విస్తరిస్తుంది' అని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.

'ఏదో ఊహించుకొని వాస్తవంతో సంబంధం లేకుండా జరిగిన స్పెక్యులేటివ్ పెట్టుబడులు రాజధానిలో ఉన్నా లేకున్నా ఏదో ఒక రోజు అటు ఇటుగా కుప్పకూలే అవకాశాలే జాస్తి' అని ఐవైఆర్ కృష్ణారావు మరో ట్వీట్‌లో విమర్శించారు. ఈ సందర్భంగా 'ఈ గ్రోత్ కారిడార్ భవిత ఏమిటి?' అంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. అమరావతి అనిశ్చితితో అంతా అయోమయం నెలకొందని, స్థిరాస్తి వ్యాపారులు, భూములు కొన్నవారి పరిస్థితి డోలాయమానంగా ఉందని అందులో పేర్కొన్నారు.

More Telugu News