Republic Day: మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కు మాత్రమే కాదు.. నాలుగు బీజేపీ రాష్ట్రాలకు కూడా దక్కని అవకాశం!

  • రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఢిల్లీ
  • పరేడ్ కోసం 56 శకటాల ప్రపోజల్స్
  • 28 శకటాలకు ఆమోదముద్ర

రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ లో శకటాల ప్రదర్శనకు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో, కేవలం రాజకీయ ప్రతీకారంలో భాగంగానే తమ రాష్ట్ర శకటాలను నిరాకరించారని ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు, బీజేపీ పాలిత నాలుగు రాష్ట్రాల శకటాలను కూడా తిరస్కరించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేపీ అధికారంలో ఉన్న త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల శకటాలు కూడా నిరాకరణకు గురయ్యాయని చెప్పాయి.

రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ డిపార్టుమెంటులకు చెందిన శకటాలు పాలుపంచుకుంటుంటాయి. ఈ శకటాలను ఒక ఎక్స్ పర్ట్ కమిటీ వరుస సమావేశాల అనంతరం ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం 56 ప్రపోజల్స్ వచ్చాయి. వీటిలో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 22 ప్రపోజల్స్, వివిధ శాఖల నుంచి వచ్చిన 6 ప్రపోజల్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో బీజేపీ అధికారంలో లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ శకటాలకు కూడా ఆమోదముద్ర పడింది.

More Telugu News