Maharashtra: రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘మహా’ శకటానికి దక్కని చోటు.. బీజేపీ కుట్రలు చేస్తోందన్న శివసేన

  • రిపబ్లిక్ డే పరేడ్‌లో మహారాష్ట్ర, బెంగాల్ శకటాలకు దక్కని చోటు
  • ఇది మహారాష్ట్రకు జరిగిన అవమానం
  • ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దీనిపై విచారణ జరిపించాలి

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్‌లో తమ రాష్ట్ర శకటానికి చోటు దక్కకపోవడంపై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకే రాష్ట్రానికి స్థానం దక్కకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించింది. పరేడ్‌లో మహారాష్ట్ర, బెంగాల్‌కే ఎందుకు చోటు దక్కలేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఎందుకంటే.. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేకపోవడం వల్లేనని అన్నారు.

మహారాష్ట్ర శకటాన్ని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ తయారు చేస్తుందని, రాష్ట్ర శకటం పలుమార్లు అవార్డులు కూడా దక్కించుకుందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. కానీ ఈసారి మాత్రం పరేడ్‌కు అర్హత సాధించకపోవడం వెనక కారణం.. రాష్ట్రంలో మహా అఘాడి ప్రభుత్వం ఏర్పడడమేనని అన్నారు. మహారాష్ట్ర శకటానికి పరేడ్ అర్హత దక్కకపోవడం అన్నది రాష్ట్రానికే జరిగిన అవమానమని రౌత్ అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దీనిపై విచారణ చేపట్టాలని సంజయ్ రౌత్ కోరారు.

More Telugu News