MUkesh Amabni: ఈ ఏడాది సంపదను అపారంగా పెంచుకున్న ముకేశ్ అంబానీ

  • ఈ ఏడాది రూ1.20 లక్షల కోట్లు పోగేసుకున్న రిల్ ఛైర్మన్
  • రూ.4.27 లక్షల కోట్లకు పెరిగిన అంబానీ మొత్తం సంపద
  • వెనకబడ్డ అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్

రిలయన్స్ ఇండస్ట్రీస్(రిల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదకు 17 బిలియన్ డాలర్లు(రూ.1.20 లక్షల కోట్లు) జోడించారు. దీంతో ఈ నెల 23 నాటికి ముకేశ్ మొత్తం సంపద విలువ 6,100 కోట్ల డాలర్లకు(రూ.4.27 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ ఈ ఏడాది కూడా ఆ ఘనతను తనపేరనే నిలుపుకున్నారు. సంపదను పోగుపర్చిన ధనవంతుల వివరాలు తెలిపే బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ప్రస్తుత సంవత్సరం రిల్ షేర్లు భారీగా పుంజుకోవడం ముకేశ్ ఆస్తి వృద్ధికి దోహదపడిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంధనం, టెలికాం రంగాల్లో రిల్ బాగా రాణించడం ముకేశ్ సంపద పెరగడానికి ఉపకరించింది. 2019లో సంపద పెరుగుదల విషయంలో ప్రపంచ కుబేరులైన అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా వెనకబడ్డారు. జెఫ్ సంపద 1,320 కోట్ల డాలర్లు వృద్ధి చెందగా, జాక్ మా సంపద 1,130 కోట్ల డాలర్లు పెరిగింది.

More Telugu News