Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ నుంచి 72 కేంద్ర పారామిలటరీ దళాల ఉపసంహరణ: కేంద్రం సంచలన నిర్ణయం

  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర బలగాల మోహరింపు
  • శాంతియుత పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి పిలవాలని నిర్ణయం
  • కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో మోహరించిన 72 కేంద్ర పారామిలటరీ బలగాలను వెనక్కి పిలవాలని నిర్ణయించింది. ఇందులో  24 సీఆర్‌ఫీఎఫ్ కంపెనీలు, 12 దళాల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 12 కంపెనీల ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళం, 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, 12 కంపెనీల సషస్త్ర సీమాబల్ దళాలున్నాయి.

 జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత శాంతియుత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 370 అధికరణను రద్దు చేసిన సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను మోహరించారు. తాజాగా, వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.

More Telugu News