Mahindra Group: మహీంద్రా అండ్ మహీంద్రా నాయకత్వంలో మార్పు... ఆనంద్ మహీంద్రాకు కొత్త బాధ్యతలు

  • ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న ఆనంద్ మహీంద్రా
  • సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
  • మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీగా పవన్ గోయెంకా పునర్నియామకం

దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు నాయకత్వంలో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సంస్థను విజయపథంలో నడిపించిన ఆనంద్ మహీంద్రా పదవి నుంచి వైదొలుగుతున్నారు. సెబీ మార్గదర్శకాల నేపథ్యంలో మహీంద్రా గ్రూపు ఈ నిర్ణయం తీసుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు పవన్ గోయెంకా ఎండీగా పునర్నియమితులవుతున్నారు. ఆయన సీఈవోగానూ వ్యవహరిస్తారు.

ఉన్నతస్థాయి నాయకత్వంలో మార్పు కోసం మహీంద్రా గ్రూపు ఏడాదిపాటు తీవ్ర కసరత్తులే చేసింది. అందుకోసం నామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక, ఆనంద్ మహీంద్రా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కంపెనీకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారని మహీంద్రా గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News