Kalyan Ram: 'ఎంతమంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

  • విడుదలకి ముస్తాబవుతున్న 'ఎంతమంచివాడవురా'
  • జనవరి తొలివారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు 

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా 'ఎంతమంచివాడవురా' రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 5వ తేదీనగానీ .. 6వ తేదీనగాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నాడనేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ఉత్సాహంగా పాల్గొంటూనే వున్నాడు. అలాగే ఆయన ఈ సినిమా ఈవెంట్ కి రానున్నాడని అంటున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.

More Telugu News