14kgs Gold seized at Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘14 కిలోల బంగారం పట్టివేత’

  • బంగారం విలువ రూ. 5.46 కోట్లు
  • విమానం సీట్ల కింద నల్లటి టేపు చుట్టి రవాణా
  • దక్షిణకొరియా, చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు

అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5.46 కోట్లుంటుందని తెలిపారు. దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ కు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. బంగారం అక్రమ తరలింపుపై పక్కా సమాచారం అందుకున్న డీఆర్ ఐ అధికారులు వ్యూహాత్మకంగా దాడిచేసి బంగారాన్ని, తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామన్నారు.
 
ఇద్దరు ప్రయాణికులు వారి సీటు కింద బంగారం కడ్డీలకు నల్లటి టేపు చుట్టి దాచారన్నారు. అనుమానం మేరకు విమానంలో తనిఖీలు చేపట్టి బంగారాన్ని గుర్తించామని అధికారులు చెప్పారు. బంగారాన్ని తీసుకొచ్చిన ప్రయాణికులుగా ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు చైనా జాతీయుడిగా గుర్తించామని వెల్లడించారు.

More Telugu News