Chandrababu: టీడీపీ కార్యకర్త కాళ్లకు నమస్కారం చేసిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

  • పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు
  • ఓ సీనియర్ టీడీపీ కార్యకర్త ఆవేదన
  • చలించిపోయిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు, తనను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని, తాను మాత్రం ప్రాణం పోయినా టీడీపీని వీడనని, వణుకుతున్న చేతులు, భయం నిండిన మాటలతో ఓ సీనియర్ కార్యకర్త మాట్లాడగా, చంద్రబాబునాయుడు చలించిపోయారు. మీ వంటి కార్యకర్తలే పార్టీకి బలమంటూ, అతని పాదాలకు నమస్కరించారు.

ఈ ఘటన కడప జిల్లాలో పార్టీ సమావేశంలో కనిపించింది. తనను వైసీపీ కార్యకర్తలు కొట్టారని అతను చెప్పగా, చంద్రబాబు ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్, తన పార్టీ కార్యకర్తలను స్వయంగా ఇటువంటి ఘటనలకు పురికొల్పుతున్నారని ఆరోపించారు.

More Telugu News