subha kalasham: అమలాపురం శుభ కలశం కూల్చివేత.. ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

  • శుభ కలశాన్ని కూల్చేసి సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయం
  • అడ్డుకున్న ప్రతిపక్ష నాయకులు 
  • కూల్చకుండా రాత్రంతా కాపుకాసిన ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు

అమలాపురంలోని శుభ కలశం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. పనులను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా కూల్చివేత పనులకు విరామం చెప్పారు. శుభ కలశాన్ని కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. శుభ కలశాన్ని కూల్చివేసేందుకు ఆదివారం అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ, జనసేన నాయకులు, స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు రాత్రంతా నిద్రపోకుండా కలశాన్ని కూల్చివేయకుండా కాపలా కాశారు. మరోవైపు, కలశం కూల్చివేతను ఆపాలంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కలశాన్ని కూల్చివేయొద్దంటూ మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News