Sharad Pawar: 'మహా' రాజకీయంలో మరో మలుపు.. సోనియాతో భేటీ కానున్న పవార్

  • రేపు ఢిల్లీకి బయల్దేరుతున్న పవార్
  • శివసేనకు మద్దతిచ్చే అంశంపై చర్చిస్తారంటూ ప్రచారం
  • మారుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ హైకమాండ్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకోబోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. సోమవారం ఈ భేటీ జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ-శివసేనల మధ్య నెలకొన్న అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో... వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.

దేశ ఆర్థిక స్థితిపై ఇరువురు నేతలు చర్చిస్తారని చెబుతున్నప్పటికీ... బీజేపీని అధికారానికి దూరంగా ఉంచే క్రమంలో, శివసేనకు మద్దతిచ్చే అంశంపై వీరు చర్చించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శివసేనకు మద్దతివ్వాలంటూ సోనియాగాంధీకి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ కు శివసేన మద్దతిచ్చిన అంశాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సోనియా, పవార్ ల మధ్య జరగబోతున్న భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీకి శరద్ పవార్ రేపు బయల్దేరుతున్నారు. ఈలోగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశంకానున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది.

More Telugu News