Pawan Kalyan: దిల్ రాజుకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్?

  • త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న పవన్
  • 'పింక్' చిత్రంలో అమితాబ్ పాత్రను పోషించనున్న జనసేనాని
  • వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం

రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్... చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన మళ్లీ నటించబోతున్నారనే వార్తలు ఈ మధ్యన బాగా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

'పింక్' చిత్రం బాలీవుడ్ లో విజయవంతమైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తమిళ వర్షన్ లో అజిత్ పోషించాడు. అదే పాత్రను ఇప్పుడు తెలుగులో పవన్ చేయబోతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.

More Telugu News