Sharad Pawar: అయోధ్య తుది తీర్పుకు ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: శరద్ పవార్

  • సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి
  • ముంబైలో గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు
  • ప్రభుత్వ ఏర్పాటులో అలసత్వం మంచిది కాదు

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించేలోగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ముంబైలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో అలసత్వం ఏమాత్రం మంచిది కాదని అన్నారు.

ఇక ముఖ్యమంత్రి పదవి విషయంలో మిత్రపక్షాలైన బీజేపీ-శివసేనల మధ్య అంతర్యుద్ధమే జరుగుతోంది. 50-50 పార్ములాను పాటించాలని శివసేన డిమాండ్ చేస్తుంటే, సీఎం పదవిని ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయపరమైన అనిశ్చితి నెలకొంది.

More Telugu News