chidambaram: తీహార్ జైలుకు చిదంబరం.. వచ్చే నెల 13 వరకు అక్కడే!

  • నేటితో ముగిసిన ఈడీ కస్టడీ 
  • ఒకరోజు కస్టోడియల్ విచారణకు నో
  • మధ్యంతర బెయిలుపై రేపు విచారణ

ఈడీ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని వచ్చే నెల 13 వరకు తీహార్ జైలుకు పంపిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం కస్టడీ నేటితో ముగియడంతో విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు.. ఒక రోజు కస్టోడియల్ విచారణ కావాలంటూ ఈడీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

నవంబరు 13 వరకు తీహార్ జైలుకు తరలించాలంటూ ఆదేశించింది. జైలులో ఆయనకు ఇంటి భోజనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ ఆదేశించారు. కాగా, పలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిదంబరానికి వచ్చే నెల 4వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ కావాలంటూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను కోర్టు రేపు విచారించనుంది.

More Telugu News