BSNL: బీఎస్ ఎన్ ఎల్, ఎంటీఎన్ ఎల్ విలీనానికి కేంద్రం ఓకే

  • పెట్టుబడులు ఉపసంహరించం
  • వీటిని మూసివేసే ప్రసక్తే లేదు
  • రివైవల్ ప్యాకేజీ కింద రూ. 29,937 కోట్లు అందజేతకు నిర్ణయం

నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు బీఎస్ ఎన్ ఎల్, ఎంటీఎన్ ఎల్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ సంస్థలను మూసివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. వీటి నుంచి పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించబోవడం లేదని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు రూ.29,937 కోట్ల రివైవల్ ప్యాకేజీని అందిస్తుందని వివరించారు. 4జీ స్పెక్ట్రంను ఈ రెండు సంస్థలకు కేటాయించాలని, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వీఆర్ ఎస్ ప్యాకేజీని ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. 

More Telugu News