Mohanlal: మోహన్ లాల్ కారణంగానే చరణ్ చేతికి 'లూసిఫర్' రైట్స్!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
  • రీమేక్ హక్కులను ఎవరికీ ఇవ్వని నిర్మాతలు 
  •  చరణ్ కి ఇప్పించిన మోహన్ లాల్   

ప్రస్తుతం చిరంజీవి .. కొరటాలతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి కెరియర్లో 152వ సినిమాగా ఇది వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా చరణ్ లైన్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో మలయాళంలో మోహన్ లాల్ నుంచి వచ్చిన 'లూసిఫర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

చిరంజీవి హీరోగా ఆ సినిమాను రీమేక్ చేయడానికి చరణ్ రంగంలోకి దిగాడు .. ఆ రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో మోహన్ లాల్ ఆయనకి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. 'లూసిఫర్' నిర్మాతలు ఇతర భాషల్లోను తామే ఈ సినిమాను నిర్మించాలనే ఉద్దేశంతో ఎవరికీ ఇవ్వకుండా తమ దగ్గరే హక్కులను ఉంచుకున్నారట. అయితే ఈ రీమేక్ రైట్స్ కోసం చరణ్ ప్రయత్నిస్తున్నాడని మోహన్ లాల్ కి తెలిసి, ఆ నిర్మాతలను ఒప్పించి రైట్స్ ఇప్పించినట్టుగా చెప్పుకుంటున్నారు. చిరంజీవితో మోహన్ లాల్ కి గల సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అనుకుంటున్నారు.

More Telugu News